మేనల్లుడు బీజేపీలో చేరడంపై వసుంధర రాజే సింధియా స్పందన

  • రాజమాత ఉండి ఉంటే నిన్ను చూసి గర్వించేవారు
  • నీ శక్తి, వ్యక్తిత్వం, ధైర్యం నన్ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి
  • మనిద్దరం ఒకే టీమ్ లో ఉండటం సంతోషకరం
జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడం పట్ల ఆయన మేనత్త, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'రాజమాత ఇప్పుడు ఉండి ఉంటే నిన్ను చూసి ఎంతో గర్వించేవారు. అన్నిటి కంటే దేశమే ముఖ్యమని భావించే నిన్ను చూసి సంతోషించేవారు. నీ శక్తి, వ్యక్తిత్వం, ధైర్యం నన్ను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మనిద్దరం ఒకే టీమ్ లో ఉండటం సంతోషకరం. బీజేపీలోకి నీకు స్వాగతం' అంటూ వసుంధర రాజే ట్వీట్ చేశారు. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Jyotiraditya Scindia
Vasundhara Raje
BJP

More Telugu News